గురు విద్య;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 కొత్త విషయాలు నేర్చుకోవాలనే అభిలాశ  చాలా మందికి ఉంటుంది.  వారి బుద్ధి కుశలతతో  కొన్ని సాధించవచ్చు  కానీ వేమన గారు చెప్పిన పద్ధతి ప్రకారం  గురుముఖతా నేర్చుకొని విజయం సాధిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. గురు శబ్దానికి అర్థం "గు" అంటే  తిమిరం (చీకటి) "రు" అంటే కూకటివేళ్లతో సహా పెకలించి వేయడం "తమసోమా జ్యోతిర్గమయ" అన్న  ఉపనిషత్ వాక్యం మనకు చిన్న తరగతులలోనే లఘువు గురువు శబ్దాలను గురించి చెప్తారు ఒక మాత్ర కాలంలో  చెప్పేది లఘువు, రెండు మాత్రలు అయితే గురువు  లఘువు కన్న గురువు పెద్దది,  గురువు ఎప్పుడూ గురుస్థానంలో ఉండదు.  లఘువు ప్రక్కన ఉన్నప్పుడు మాత్రమే గురు స్థానం ఉంటుంది. గురువు ప్లుతము ప్రక్కన వుంటే అది గురువు   అవుతుంది. కాకుమాను   పక్కనే పంచమం ( ఓంకారం) వుంటే అది గురువు అవుతుంది. ఓంకారం అకార ఉకార మకార సమన్వయం  సృష్టి స్థితి లయలకు మూలము  అది శాశ్వతం.భౌతిక శాస్త్రంలో చెప్పాలంటే  మనిషి ప్రక్కన ఎద్దు ఉంటే అది గురువు  దాని ప్రక్కన ఏనుగు ఉంటే అది గురువు దాని ప్రక్కన నది ఉంటే, దాని ప్రక్కన సముద్రం ఉంటే,  దాని ప్రక్కన ఆకాశం ఉంటే అది గురవుతోంది  పోల్చడానికి మరేదీ లేదు అని చెప్పుకునేది ఏదైతే ఉందో అది గురు శబ్దం. దానిని భగవంతుడు అనుకోండి, ఉపాధ్యాయుడు అనుకోండి,  ఆత్మానందం పొందే పరమాత్మ అనుకోండి దానిని తెలుసుకుని ఆచరించిన వాడు  జీవితంలో స్థిరమైన  విద్యను నేర్చుకునే వారవుతారు. లేకుంటే మనం చేసే ప్రయత్నానికి ఫలితం ఉండదు  అందుకే వేమనా మాత్యుడు  గురుద్వారా విద్య నేర్చుకోమని చెప్తారు.


కామెంట్‌లు