చిలుకా చిలుకాఅందమైన చిలుకానీ సంగతి ఏమిటో చెప్పమ్మానీ సంగతి ఏమిటో చెప్పమ్మా!! చిలుకా!!ముచ్చటగొలిపే పచ్చని రంగునీ ఒంటికెలా వచ్చింది?నీ ఒంటికెలా వచ్చిందీ?పచ్చపచ్చని చెట్లలొ తిరిగీతిరిగీనావొంటికి రంగు వచ్చిందినా ఒంటికి రంగు వచ్చిందీ!! చిలుకా!!చక్కనైన ఎర్రని రంగునీ ముక్కుకెలా వచ్చింది?నీ ముక్కుకెలా వచ్చిందీ?ఎర్ర ఎర్రని పళ్ళను కొరికీకొరికీనా ముక్కుకు రంగు వచ్చిందీనా ముక్కుకు రంగు వచ్చిందీ!! చిలుకా!!హాయనిపించే తీయని మాటలునీ నోటి కెలా వచ్చాయి?నీ నోటికెలా వచ్చాయి?తీయని పళ్ళూ తినగాతినగానా మాటలు తీయగ అయినాయినా మాటలు తీయగ అయినాయి!! చిలుకా!!నీ రంగులు పలుకులు బాగున్నాయ్నీ రంగులు పలుకులు బాగున్నాయ్మా పాపకు తోడూ ఉండవోయ్మా పాపకు తోడూ ఉండవోయ్!! చిలుకా!!
చిలుకా (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి