తల్లి కొంగుకు చిల్లు పడినదో యేమో తెలుగు అక్షరాలు
ఉట్టిగా నేలపాలు అవుతున్నాయి...
మారు భాషల సంభాషణలలో నాలుకలు మందగించాయో యేమో
తెలుగు పదజాలాల, పద్యాల పలకరింపులు కరువై పోతున్నాయి...
తరాల ఎరువు వారసత్వంగా అందలేదో యేమో
తెలుగు పదాల పసిడి సిరులు కనుమరుగై పోతున్నాయి...
మమకారపు స్పర్శ
మొత్తంగా దూరమైనదో యేమో తెలుగు పుస్తకాల
గ్రంధాలయాలు ఉనికిని కోల్పోతున్నాయి...
లాభ నష్టాల బేరసారాలు ఇంకా కుదరలేదో యేమో
తెలుగు వ్యాకరణాలు వృద్ధి లేక వృధా పోతున్నాయి...
నవ నాగరికత మోజులో పడి పరభాషా మోహం
ముదిరి పోయినదో యేమో నిర్లక్ష్యపు వ్యవహారపు అలవాట్లు
వర్తమాన కాలంలో తల్లి బా
భాషతో తెగదెంపులకు దారితీస్తూ పోతున్నాయి...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి