సమాజంలో " కుటుంబం " పాత్ర ;-*డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్*
  *కలసి ఉంటే కలదు సుఖం... ఒంటరిగా నాలుగు అడుగులు నడవచ్చు కానీ..... పలువురితో  కలిసి  నడిస్తే  పది అడుగులు ముందుకు వెళ్ళవచ్చు . కానీ నేటి సమాజం రోజురోజుకి  కొత్త పద్ధతులను అనుసరిస్తూ  స్వేచ్ఛాయుత జీవితాన్ని గడపాలనే ధోరణి లో ముందుకు వెళుతుంది.*  
 అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రతి ఏట మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం ఈ కుటుంబ దినోత్సవం నిర్వహించబడుతుంది.
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం
1983లో ఐక్యరాజ్య సమితి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల వైపు మళ్లింది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సోషల్ డెవలప్ మెంట్ కమిషన్ అప్పటి సెక్యూరిటీ జనరల్ కుటుంబాల సమస్యలు, వారి అవసరాల గురించి మరింత అవగాహన పెంచుకోవాలనుకుంది. మే 29, 1985న ఆమోదించిన తీర్మానంలో కౌన్సిల్ సిఫారసు పై జనరల్ అసెంబ్లీ అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని కూడా చేర్చారు. డిసెంబర్ 1989లో ప్రతి సంవత్సరం మే 15న జరుపుకునే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం విభిన్న ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది కుటుంబ సమస్యలను నియంత్రించే విషయాలను తెలియజేస్తుంది.
             గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడంకోసం సూచిక గా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం  జరుపబడుతుంది. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించబడుతున్నాయి. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏట ఒక అంశం ప్రకటించబడుతుంది.
 పట్టణీకరణ అనేది మన ప్రపంచాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల జీవితాన్ని మరియు శ్రేయస్సును రూపొందించే అతి ముఖ్యమైన మెగాట్రెండ్‌లలో ఒకటి.
     మన భారతదేశంలో నేడు మారుతున్న సమాజంలో జరుగుతున్న ఎన్నో మార్పులు , పెరిగిపోతున్న విడాకులు , గృహహింసల కారణంగా ' సింగిల్ పేరెంట్ ' ఉండే కుటుంబాలు ఎక్కువయ్యాయి . సామాజికవేత్తలు కుటుంబంలో వుండే యాజమాన్యం మరియుఅధికారాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు . 1. పితృస్వామ్య కుటుంబం- కుటుంబంపై తండ్రి అధికారం వుంటే దాన్ని పితృస్వామ్య కుటుంబం అంటారు అధికారం స్త్రీ వుంటే దాన్ని మాతృస్వామ్య కుటుంబం అంటారు . రెండు రకాల కుటుంబాలు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోకి వస్తాయి.మేఘాలయలోని ఖాసీ తెగల్లో మరియు కేరళలోని నాయర్ సమూహంలో  మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది .
----------------------
*డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్*
సాహితీవేత్త, ఎడిటోరియల్ కాలమిస్ట్
సభ్యులు,
ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్.
 రాజన్న సిరిసిల్ల, తెలంగాణ.
సెల్.9490841284.

కామెంట్‌లు