పల్లెల నుంచి నగరాల వరకు
అధికారులు పెత్తనాన్ని చెలా ఇస్తూ ఉంటారు గ్రామాలలో చూస్తున్నాం రైతులుగాని పేదరికాన్ని అనుభవించేవారు కానీ కరణం మునసబు గారి దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ గ్రామంలో పెద్ద ఆస్తిపరులు ఎవరు ఉంటారో వారి దగ్గరకు ఈ కరణాలు మునుసబులు చేరుతూ ఉంటారు వారి సమస్యలన్నిటినీ అక్కడనే పరిష్కరిస్తుంటారు కూడా. మనం చూస్తున్న ఈ పల్లెపట్టుల వాతావరణమే నగరాలలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి కూడా చేతినిండా డబ్బులు ఉంటే అతనిని చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. మామూలు వాడిని ఇంకొక రకంగా చూస్తూ ఉంటారు. వారి భోజన పానాదులలో కూడా తేడాలు గమనించవచ్చు. పెద్ద పెద్ద అధికారుల దగ్గర కూడా ఈ తతంగాన్ని చూడవచ్చు. పై అధికారి చెప్పే మాటలు అనుసరించి చేయవలసినదే కానీ వారి సొంత అభిప్రాయాలు పనికిరావు. ఇక్కడ అధికారమే తప్ప కుల, మత, వర్ణ, వర్గ భేదాలు ఎక్కువగా కనిపించవు. అందుకే వేమన తన ఆటవెలదిలో "పసిడి గల్గు వాని బానిస కొడుకులు" అని అవహేళన చేస్తారు. ఈ రోజున చేతిలో డబ్బు ఉంటే కాని పని ఉండదు, మన కళ్ళతో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. రాచరికంలో ఉన్న వేమన జ్ఞాన స్థితి కి వచ్చి అద్భుతమైన లోక నీతులను మనకు అందించడం విశేషం.
"కులము గలుగువారు గోత్రము గలవారు
విద్య చేత విర్రవీగువారు పసిడి గల్గువాని బానిస కొడుకులు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి