కనేవి.. వినేవీ..
******
కనేవీ అంటే చూసేవీ అని కూడా అర్థం. ఈ చూసేవి ఒకోసారి దృష్టి భ్రమను కలిగిస్తాయి. ఇతరుల గురించి తెలిసీ, ఎవరో చెప్పిన మాటలను బట్టి మనం చూసే చూపుల్లో తేడా వస్తుంటుంది.
ఆ వెను వెంటనే మనసులో చేరిన అపోహలు, మాటల్లో కూడా వ్యక్తమవుతుంటాయి.
అవి ఎదుటి వ్యక్తికి ఎంతో బాధను కలిగిస్తుంటాయి
కాబట్టి మన కళ్ళతో చూసిన తర్వాతే, అందులో నిజానిజాలను తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయానికి రావాలి.
అలాగే వినేవి కూడా.. మనకు పడీ పడని వారి గురించి చెవుల్లో దూరి రకరకాలుగా వినిపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద మరింత దూరం పెరిగేలా , ద్వేషం కలిగేలా చేస్తారు. ఇలా వినేవన్నీ నిజాలు కాకపోవచ్చు.
అందుకే శత్రువు గురించైనా చెడుగా చెప్పే మాటల్లో సత్యాసత్యాలను గ్రహించాలి.
కనే,వినే వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దవాళ్ళు అనుభవంతో చెబుతుంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి