నేటి స్థితి ;టి. వి. యెల్. గాయత్రి.-పూణే
 గ్యాసుబండ ధరయె గగనంబు చూడగా
నుప్పు పప్పు పెరిగె నుప్పతిల్లి
కూరగాయలనిట కొనలేక గృహిణులు
తిండి వండలేక దీనులగుచు
తరుణు లంత చేరి తలలు పట్టుకొనిరి
ధరలు పెరిగె నంచు
వెఱపు తోడ
మధ్య తరగతికిదె మహిలోన కష్టము
తెఱవు చూప లేడు దేవుడైన //కామెంట్‌లు