అమ్మా... నాకడుపున పుట్టవా! కోరాడ నరసింహా రావు !
ప్రతిఫలమేమీ కొరక... 
  అన్నీ ఇచ్చిన అమ్మకు... 
     నేనేమిచ్చాను... !?

అమ్మా...నాకడుపున పుట్టవా!
  నువ్విచ్చినవన్నీ.... నీకుతిరిగి సమర్పించుకుని... 
      నారుణం తీర్చు కుంటాను!

నీకు అమ్మనయే అదృష్టం... 
     చాలమ్మా నా జన్మకు !

నీ ప్రేమతో కూడిన సేవలోని 
   మాధుర్యాన్ని... నన్నూ 
     అనుభవించనీయవా... !
********

కామెంట్‌లు