గ్యాసు పొయ్యిన వంట
వంట చేయుట తంట
తంటగా ధరలతో బాదుడే ఓ వనజ !
వనిత కిప్పుడు నైసు
నైసుగా తన సొగసు
సొగసు కట్టెలపొయ్యి మాయమే ఓ వనజ !
రెండొంద లుండినది
ఉండి యలరించినది
అలరించి యంతలో కొండెక్కి ఓ వనజ !
గిన్నె కిందకి మంట
మంట డబ్బులకంట
డబ్బుతో ఆకళ్ళు తీరాలి ఓ వనజ !
సామాన్య ప్రజల కథ
కథలయ్యె బ్రతుకు సుధ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి