అధర్ముడు.పురాణ బేతాళ కథ.- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు,- చెన్నై

విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు అధర్ముడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా  అధర్ముడు వరుణునికి జ్యేష్ఠాదేవి యందు పుట్టిన కొడుకు. ఈతనిభార్య నిరృతుని కూఁతురయిన హింస; కుమారులు భయుడు, మహాభయుఁడు, మృత్యువు. చెల్లెలు సురనిందని.
శ్రీ మద్భాగవతముప్రకారముఅధర్ముఁడు మృషను వివాహమాడినట్లును, ఆమెయందు దంభుఁడు అను కొడుకును, మాయ అను కూఁతురును కలిగినట్లును, వారికి ఇరువురకు లోభుఁడు అనుకొడుకును, నికృతి అను కూఁతురును పుట్టినట్లును, వారికి క్రోధుఁడు, హింస పుట్టిరనియు, వారికి కలియు, దురుక్తియు పుట్టిరనియు, వారికి మృత్యువును, భీతియు కలిగిరనియు, ఆమృత్యువునకు భీతియందు నిరయుడు, యాతనయు పుట్టిరనియు చెప్పఁబడి ఉంది.
విష్ణుపురాణము ప్రకారము అధర్మునికిని హింసకును అకృతుడు అను కొడుకును, నికృతి అను కూతురును పుట్టినట్లును, నికృతియందు అనృతునికి భయుఁడు, నరకుఁడు అను నిద్దఱు పుత్రులును, మాయ, వేదన అను నిద్దఱు పుత్రికలును జన్మించినట్లును, అందు భయునికి మాయయందు మృత్యువు అనువాడును, నరకునికి వేదనయందు దుఃఖుడు అనువాడును పుట్టినట్లును చెప్పి ఉంది. మఱియుమృత్యువునకు వ్యాధి, జర, శోకుఁడు, తృష్ణ, క్రోధుఁడు అనువారు పుట్టి లోకమును నాశము చేయుచుందురనియు చెప్పి ఉంది 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు