సుదర్శన చక్రం.పురాణ బేతాళ కథ.; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు సుదర్శనచక్రం గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
బేతాళా సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకొంటాడు. మిగిలిన మూడు చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శనచక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరిదినాన స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది.
ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడు ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను, అగ్నిని, సోముడు, మిత్రవరుణులు, ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.
సుదర్శనోపనిషత్తు ప్రకారం, సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారుచేయబడినది. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపట్టాడు. అప్పుడు రాలిన పొడితో మూడింటిని తయారుచేశాడు.ఒకటి పుష్పకవిమానం,రెండవదిపరమశివుని త్రిశూలం, మూడవది విష్ణుముర్తి సుదర్శన చక్రం 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.



కామెంట్‌లు