పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 శ్రీకాళహస్తి: నలబై రెండు సంవత్సరాల తరువాత ఆ మిత్రలందరు మొదటి సారిగా ఆత్మీయంగా కలుసుకున్నారు. కొండమిట్ట ప్రాథమికోన్నత
పాఠశాల 1979-80 సంవత్సరం ఏడవ
తరగతి చదివిన విద్యార్థులు స్థానిక ఎం.జి.ఎం.గ్రాండ్ లో కలిసారు.ఆనాటి
తమకు విద్యాబోధన లు నేర్పిన గురు
వులను ఆహ్వానించారు.పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
అల్లరి పనులను గుర్తు తెచ్చుకున్నారు.
తమ ఉన్నత స్థితికి కారణమైన గురు
వుల ఆశీస్సులు తీసుకున్నారు. వారిని
సన్మానించారు.బోధన చేసిన ఆనాటి
గురువులు శ్రీ సుబ్బయ్య, గోపాల్,శ్రీమతి
కస్తూరి,కళావతి,నిర్మల,చంద్రలీల, కామేశ్వరి మొదలగు వారు పూర్వ విద్యార్థుల మిత్రబృందానికి ఆశీస్సులు అందించారు.ఈ కార్యక్రమంలో  పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు
మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం చేసిన ధ్వన్యనుకరణ
ప్రత్యేక ఆకర్షణగా అలరించింది.
కామెంట్‌లు