ప్రపంచానమన కేతన మెగర వేయండి మీరు.. !;- కోరాడ నరసింహా రావు
 ఏది ?, ఏమిటి !?, ఎందుకు ?!
తెలియని తికమకలు బాపి... 
చక్కగ తెలియజెప్పునదే... 
         * చదువు *.... !
అర్ధముకాని చదువులు... 
    వ్యర్ధమై పోవును... !
అయోమయములోకినెట్టి,మరిం త మొద్దులుగామార్చును !
తల్లి, తండ్రి, ఇంటివారు...వీధి, 
ఊరు, ప్రాంతమంతా మాట్లాడే భాషలోనే... చదువు బోధ పడు ను  సులువుగా.... !
ప్రాధమికవిద్య ఎపుడు, మాతృ
భాషలోనె మేలు!...సులువుగా
బోధపడిచురుకుదనంపెంచును
ఉత్సాహాన్ని పెంచి  వడి-వడిగా నడిపించును ... !!
మారిన ఈ కాలంలో... బ్రతుకు తెరువు దారులలో... ఆంగ్లమే ముందున్నది !
.   వినిమయ విజ్ఞానమంత....
ఇంగిలీషు లోనె ఉంది !
    ఉపాధి అవకాశాలకు నేర్చక 
తప్పని భాషిది... !!
   ఆరవ తరగతి నుండి ఆంగ్ల భాష నేర్చుకోండి !
   విస్తృత విజ్ఞానాన్ని చక్కగా.
 పొందండి !!
   ఎక్కడైన -  ఎలాగైనా..... 
 ధైర్యంగా... దర్జాగా  బ్రతకగలసత్తా...మనకున్నదని  చాటుతూ... మనవిజయ కేతనమును ఈ భువిపై ఎగరేయండి.... !
     ******

కామెంట్‌లు