ఉభయ తారకం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓఅవ్వ తాత తల్లి వదిలేసిపోయిన ఓకోతిపిల్ల దొరికితే పెంచుకుంటున్నారు.వారం కూడా కాకుండానే బిచ్చగాడివేషంలో వచ్చిన  ఒకడు దాన్ని ఎత్తుకుపోయి చిన్న చిన్న సర్కస్ ఫీట్స్ చేయించసాగాడు.నెత్తిన గిన్నె పెట్టి  కాళ్ళకి గజ్జెలుకట్టి లంగా ఓణీవేసి  డాన్స్ చేయించేవాడు. సరిగా తిండి పెట్టక ఏడ్పించి కొట్టి ఫీట్స్ చేయిస్తుంటే పాపం ఆకోతిపిల్ల అవ్వ తాతలను తల్చుకుంటూ ఏడ్చేది.వాడికి డబ్బు బాగా దొరికిన రోజు ఊటుగా తాగి కోతి పిల్లను చెట్టు కి కట్టేసి  మత్తు లో మునిగాడు.కోతి  తాడు తెంపి పారిపోవాలి అని చూసింది.కానీ దానికి సాధ్యం కావటంలేదు. ఇంతలో శివ  అనే అనాధ కుర్రాడు అటుగావస్తే కోతి బతిమాలింది. పట్నం లో ఏదైనా పనిదొరుకుతుందేమో అని బైలుదేరాడు.ఊరిచివర ఓనాటక కంపెనీ డేరా వేసుకుని  ఆరాత్రి నాటకంకి తయారు అవుతున్నారు. కోతి పిల్లతో శివా  వారి దగ్గరకు వెళ్లి "నాకు ఎవరూలేరు.ఈకోతిపిల్లను ఓదుర్మార్గుడి బారినుండి కాపాడినాతో తెస్తున్నాను.మీకు కావల్సిన పనులు చేసి పెడతాను. మాఇద్దరికీ ఆశ్రయం ఇవ్వండి "అని బతిమాలాడు. ఆరోజు వారు మొదటి సారిగా హనుమంతుడి లంకాప్రవేశం నాటకం ప్రదర్శించబోతున్నారు."అరె!మన అదృష్టవశాత్తు బుల్లి హనుమ  తన నిజరూపంలో వచ్చాడు "అని సంతోషించి ఆకోతిపిల్ల కి కాషాయచెడ్ఠి నుదుటనామాలుపెట్టి శివ కి తోటకాపలాదారు వేషంవేసి  నాటకంలో ప్రవేశ పెట్టారు. అశోక చెట్టు పై  కోతి పిల్ల తన కుతోచిన హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటే తెరవెనుక "శ్రీరామ జయరామ జయజయరామ" అన్న పాటవినపడటంతో జనం పరవశించి పోయారు. అలా శివా  కోతి ఆనాటక కంపెనీలో సుఖంగా హాయిగా ఉన్నారు. అంతా ఆకోతిని అంజన్నా హనుమన్న అని ముద్దు చేసి  నాటకంలో పాత్ర గా శివా నికూడా ఉపయోగించుకోసాగారు.ఇదే ఉభయతారకం అంటే🌹
కామెంట్‌లు