శ్రామికచైతన్యగీతం -- రచన, స్వరకల్పన, గానం.....-- కోరాడ నరసింహా రావు

 పల్లవి :-
       కదం తొక్కుతూ... పదం పాడుతూ...వడి - వడిగా ముం
దుకు కదులుదాం !
    న్యాయమైన మన హక్కులు
హరించు, ధన మదాంధులను నిల దీసి... అడుగుదాం !!
      "కదం తొక్కుతూ...... "
చరణం :-
        శ్రమ అందరిదీ సంపాదొ  కరికా...,ఈ అన్యాయం సాగదు 
  ధనము - వనరులు ఎన్నున్నా 
శ్రమశక్తితోనె ఉత్పత్తి ! మన శ్రమ శక్తితోనె  ఉత్పత్తి... !!
     "కదం తొక్కుతూ..... "
చరణం :-
     శ్రమ ఫలమును ఒకరే కాదు
అది అందరికీ అందాలి !
     అధికలాభాలు ధర్మబద్ధంగ
        ప్రతిఒక్కరికీ పంచాలి !!
సమన్యాయం - సమ ధర్మం ఈ 
ఇలపై మనమే నిలపాలి.... ఈ 
ఇలపై మనమే నిలపాలి ! ఈ ఇలపై... మనమే  నిలపాలి !!
.    ******
కామెంట్‌లు