కడుపులో నొప్పి....
విల - విల లాడుతూ...
అరగకక్కడ !
ఆకలి కిక్కడ !!
*******
కష్టపడేవాళ్ళకి....
సుఖమే కరువు !
సుఖపడే టోళ్లకు
ఒళ్ళే బరువు !!
*******
ఆశ - ఆశయ0...
మహోన్నతమే... !
ఆచరణ సూన్యం...
వట్టి పగటి కలలే... !!
. ****;*
ఎంతో ఎత్తు కెదిగాడు...
ఖర్జూరం చెట్టులా...
ఏ ఒక్కరికీ....
. ఉపకారం లేదు !
*******
డిగ్రీలున్నాయ్....
సంపాదనా ఉంది... !
సంస్కారం లేదు....,
నైతికబోధన లేదుగా !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి