ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో.....--------------------------------పాట్లు మావినోట్లు మీవి.శ్రమ మాదిసౌఖ్యం మీది.ఆకలి మాదిఆహ్లాదం మీది.దాస్యం మాదిలాస్యం మీది.ఆవేదన మాదిఆనందం మీది .విల విలలాడుతూ మేముకళ కళలాడుతూ మీరు.పీనుగలయ్యేది మేముఏనుగులయ్యేది మీరు.దోచుకోబడేది మేముదాచుకునేది మీరు.ఓడుతూ మేముఆడుతూ మీరువిషాదాలు మాకువినోదాలు మీకు.రోగాలు మాకుభోగాలు మీకు.అప్పులు మాకుకుప్పలు మీకు.కండలు కరిగేది మాకుకొండల్లా పెరిగేది మీకుబంజరు భూములు మాకుబంజారాహిల్స్ లు మీకు.కన్నీటి శోకాలు మాకుకనకాభిషేకాలు మీకు.పచ్చడి మెతుకులు మాకుపంచ భక్ష్య పరమాన్నాలు మీకు.ఏమిటిది? ఎందుకిలా??ఎన్నాళ్ళిలా???
ఏమిటిది? ఎందుకిలా??;--బాలవర్ధిరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి