నా పెదాల పై స్వఛ్చమైన చిరునవ్వు అమ్మా;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.

 బాధ్యతలు ఎరుగని అమాయకత్వంలో మూడుముళ్ల బంధంలో అడుగులు వేసింది నువ్వు....
భారమైనా బాధ్యతగా నన్ను నవమాసాలు ప్రాణంగా మోసింది నువ్వు....
నీ ఒడిని ఊయల చేసి నన్ను నిద్రపుచ్చింది నువ్వు...
అమ్మా! నాతో కలిసి చిన్న పిల్లలా ఆటలు ఆడింది నువ్వు...
అన్నం తినక ఆటలాడుతానంటూ అంటూ మారాం చేసిన వేళ భయపెట్టి నాకు అన్నం తినిపించింది నువ్వు....
నే చేసినా తప్పు నాకు తెలియాలని నాపై గట్టిగా అరిచింది నువ్వు....
కోపం తగ్గిన తర్వాత "రారా కన్నా" అంటూ ప్రేమగా  పిలిచింది నువ్వు...
నాకు గోరుముద్దలు పెడుతూ ముద్దు ముద్దుగా మాటలు నేర్పింది నువ్వు...
పెద్దల ఎదుట హద్దులు దాటిన మాటలకు అడ్డుగా నిలిచింది నువ్వు....
వేలు పట్టి నా చిట్టి చిట్టి పాదాలకు నడకలు నేర్పింది నువ్వు....
నిన్ను చేరాలని పదేపదే పరుగులు తీసి కింద పడిన వేళ నా కన్నీరు తుడిచింది నువ్వు...
నేను జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆరాటపడింది నువ్వు....
నీ జీవితంలో, నీ మనసుకు నచ్చింది మాత్రమే చేయమని చెప్పింది నువ్వు...
నీకు ఇష్టాలను- కష్టాలను త్యాగం చేసి నిస్వార్ధంగా నిలిచింది  నువ్వు...
ఆ దైవమే నాకు ఎదురై ఏం కావాలని అడిగితే నేను కోరుకునేది నీ పెదవుల పై చిరునవ్వుగా పరిమళించాలి అమ్మా...

కామెంట్‌లు