సంపత్కారకుడు సింహాచలేశ్వరుడు;--ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- విశాఖపట్నం

 మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం సింహాచల క్షేత్రం.
వైశాఖ శుద్ధ తదియ నాటి స్వామి నిజరూప దర్శనం
సంపదలనిచ్చు,జీవన సాఫల్యతను చేకూర్చు
ఉగ్రరూపుడైన నృసింహ స్వామి చందన లేపంతో
కప్పబడి ఉండి నిజరూప సందర్శనం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తృతీయ నాడు లోకకల్యాణం కొరకై  కన్పించును
నాడు స్వామిని దర్శించిన కోరిన కోర్కెలు తీర్చు
సంతాన ప్రాప్తి కలుగు
జన్మరాహిత్యం కలుగునని
శ్రీమద్ రామానుజాచార్యులు వెయ్యి సంవత్సరాల క్రితమే చెప్పిన మహానుభావులు
పుష్కరిణి, గంగధార స్నానం పవితమైనది
శిల్పసంపదకు నిలయం సింహాచలేశ్వరుని దేవాలయం. కప్పస్థంభ ఆలింగనం సంతానప్రాప్తినిచ్చు.
సంపెంగ పూల ఆరాధన శుభములచేకూర్చు
ఎన్నో ఎన్నెన్నో మహిమల పుణ్యక్షేత్రం సింహాచలం
చందనోత్సవం మోక్షదాయకం.....!!

కామెంట్‌లు