ఊహల కాగితం;-డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు
 మనసులోని ఊసులను
నింపాలని తెల్లని ఊహల కాగితాన్నినేల పైన పరిచి....
రంగురంగుల కలాలతో నా భావాలకు వర్ణలను 
అద్దాలని నా కలాన్నికదిలించాను....
మొదట,
నీలిరంగుని అద్దాను ప్రయత్నం నెగ్గలేదు....
చిలుక పచ్చరంగుని అద్దాను చింతతీరలేదు....
గులాబీ రంగుని అద్దాను గుబులుపోలేదు....
పసుపు రంగుని అద్దాను ఫలితం లేదు....
కాటుక రంగుని అద్దాను కలత తగ్గలేదు.....
ఎరుపు రంగుని అద్దాను ఏం లాభం లేదు....
మొత్తంగా రంగులన్నిటిని కుమ్మరించాను 
అయినా కానీ…
మంచు ముత్యాల లాంటి 
నా అక్షరాలు ఏ మాత్రం మెరవలేదు.....
విసుగొచ్చిన నేను విసురుగా లేచి చూడగా....
నిశబ్దంగా చుట్టూ ప్రాంగణం.... నిద్రావస్తలో అందరు జనం....
అప్పుడు తెలిసి వచ్చింది నాకు.....
ఇంకా రేయి కనురెప్పలు విప్పలేదని....
రవి కిరణాల కాంతి వెలుగై రేయి పై
దుప్పటిని ఇంకా కప్పలేదని....


కామెంట్‌లు