సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 చెప్పుకోకు..తప్పుకోకు.
******
ఈ లోకంలో మనిషన్నాక చీకటి వెలుగుల్లా, కష్టాలు సుఖాలు వస్తూ, పోతూనే ఉంటాయి.
 "సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి" అన్నట్లు.. ఉన్న వారా పేదవారా అనే తేడాలేకుండా .. కొన్ని ఈతి బాధలు, కష్టాలు కలుగుతూనే వుంటాయి.
ఎవరి కష్టం వారికి కొండంత అనిపించడం సహజం..
 దానిని పంచుకునే వ్యక్తులు మనసుకు దగ్గరైన వారైతే ఫరవా లేదు.
కానీ  అదీ ఒక కష్టమేనా అని పలురకాలుగా వక్రీకరించి మాట్లాడే వారు మన చుట్టూ చాలా మందే ఉంటారు.
అలాంటి వారు వినేటప్పుడేమో జాలీ, సానుభూతి  అతిగా వ్యక్తం చేసి, ఆ తర్వాత హేళన, చులకన చేస్తూ మాట్లాడుతుంటారు.
అందుకే సాధ్యమైనంత వరకూ మన కష్టాలు, బాధలు ఇతరులకు చెప్పుకోకుండా ఉండటమే ఉత్తమం.
ఇక మనల్ని నమ్మి కష్టాలు బాధలు పంచుకునే వారుంటారు. అలాంటి వారికి  అవసరమైనప్పుడు మాటల్లో, చేతల్లో సాయం చేయడానికి  ఎప్పుడూ తప్పుకోకూడదు.
అది వారికి మన మీద ఉన్న గొప్ప విశ్వాసానికి తార్కాణం. దానిని ఎప్పుడూ సడలనీయకుండా కాపాడుకోవాలి..
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు