* ఆనంద తాండవం *; - కోరాడ నరసింహా రావు
శివపార్వతులిరువురూ... 
  నాట్యమ్మున పోటీ పడగా.., 
గెలుపెవరిదొ - ఓటమెవరిదో 
తెలిసికొనగ .... కైలాసమే... 
   ఉత్సుకతన జూచుచునుండె!

నిలువలేని సిగలో గంగ... 
   ఉరికి పైకి ఉబుకుచు నుండె !
మెడలోని నాగరాజు తాళలేక జారుచుండెను !!

    ఢమ - ఢమ యని ఢమ రుక 
మేఆనందముతెలుపుచునుండె
   శివతేజము పూర్ణరూపమున 
ఆరాయై ప్రకాశించెను... !

   ఆది దంపతుల ఆనందకేళికి 
సకలదేవతలు సంతసించిరి !
 నా కళా హృదయమీ నటనకు 
పులకించి, పరవసించెను !!
     ********

కామెంట్‌లు