ప్రొటగొరస్ పెరడాక్స్! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకే విషయం రెండు వైపుల నించి ఆలోచించి చూస్తే విరుద్ధంగా ప్రతికూలంగా కనపడుతుంది. ఇద్దరు వ్యక్తుల వాదన ఆలోచన సరియైనదే అనిపిస్తుంది. దీని వెనకో కథ ఉంది. 2వేల ఏళ్ళ క్రితం గ్రీస్ లో ప్రొటగొరస్ అనే లాయర్ ఉండేవాడు. యుధలోస్ అనే యువకుడు అతని విద్యార్ధి."అయ్యా!మీదగ్గర అప్రెంటిస్ గా చేరుతాను.కానీ మీకు ఫీజు ఇచ్చుకోలేను.లాయర్ గా నేను గనుక తొలి కేసుగెలిస్తే మీఫీజు చెల్లిస్తాను"అన్నాడు. లాయర్ సరేనన్నాడు.విద్యార్థి శిక్షణాకాలం ముగిసింది.కొన్నిరోజులు గడిచాయి. విద్యార్ధి ఫీజు ఊసు ఎత్తటంలేదు.లాయర్ అతనిపై కేసువేయాలనుకున్నాడు.ఆయన ఇలా ఆలోచించాడు" నేను కేసుగెలిస్తే  నావిద్యార్ధి చట్టప్రకారం చెల్లించి తీరాలి.నేను ఓడినా  అతను  అన్న మాట ప్రకారం  నాఫీజు చెల్లించి తీరాలి. " కానీ  విద్యా ర్ధి  ఆలోచన  దీనికి  పూర్తిగా విరుద్ధంగా ఉంది. " నేను  కనుక కేసు గెలిస్తే  ఫీజు లాయర్ కి చెల్లించనవసరంలేదు.ఎందుకు అంటే ఆయనే నాపై కేసుపెట్టి ఓడాడు కాబట్టి! ఒకవేళ నేను కనుక ఓడితే  నాతొలికేసు ఓడానుకాబట్టి ఫీజు చెల్లించే సమస్య ఉండదు." ఇలా వారిద్దరి ఆలోచనలు పరస్పర వ్యతిరేకంగా ఉన్నా ఎవరి ఆలోచన వారిది కరెక్ట్  అనే అనిపిస్తుంది. దీన్ని ఆంగ్లంలో ప్రొటగొరస్ పెరడాక్స్  అని  అంటారు. 🌷
కామెంట్‌లు