అద్దంలో చూస్తూ తలదువ్వడం
మర్చిపోయా..అదో టైమ్ వేస్ట్.
చెంపల్లో,పాపిట్లో వెండితీగలు
వయసు గుర్తుచేస్తూ..
అవునుమరి ఫార్టీ ప్లస్ కదా..
మొన్నటిదాకా అందరు అడిగివదిలేసిన ప్రశ్న..ఇప్పుడు
దర్పణమే అడుగుతా ఉంది..
దర్పంగా.. ఎవరికితగ్గ బాధలు వాళ్ళవి. మనం ఎవర్నీ మెప్పించనక్కరలేదు.మనదారిలో అడ్డంకులు సవరించుకోవడ
మనే క్రమంలో వీలుంటే ఇతరులకీ సాయం చేయడం..
ఇది చాలులే సంపూర్ణత్వానికి !
పూర్ణత అంటే అమ్మగుర్తొస్తూ
ఉంది. ఆమెనాకూ తమ్ముడికీ
గొప్ప స్ఫూర్తి.ఇరవై అయిదుఏళ్ళ వయసులో వితంతువైనా, పిల్లలకోసం ఎన్నో శ్రమలకోర్చి... తండ్రి ఆశ్రయంలో తనకాళ్ళమీద తాను నిలబడి చిరుద్యోగిగా..
బ్రతుకుని జయించిన అమ్మ...
ఎప్పుడూ ఒకరికి ఆపన్నహస్తం
గానే ఉండేది.
ఎనభైఆరేళ్ల తాతయ్యే ఇప్పుడు చెప్తూఉంటాడు,మీ
అమ్మ నాకు కూతురుకాదురా
గురువు అని.
కూతురు బ్రతుకుచక్కదిద్దే
ప్రయత్నం చేసినా పొసగనివ్వ
లేదు అమ్మ.మా మేనమామలు
అస్సలు పట్టించుకోకున్నా తన
ప్రయత్నం తాను చేశాడాయన.
"సరోజినీ,నీది చిన్నవయస
యినా ఓర్పుఎక్కువ. అందుకే
నామాట విని మళ్ళీపెళ్లి చేసుకో.పిల్లలు చిన్నవాళ్ళే. ముందు బోలెడు జీవితం ఉంది.పిల్లలని నేను చూసుకుంటా తల్లీ.నువు సరేనంటే ప్రయత్నం చేస్తాను. "
అన్న తాతయ్యని వారించినదట అమ్మ !
"వద్దు నాన్నా. నువ్వుపెంచడం ఏంటి?కన్నతల్లిని అంత స్వార్ధంగా ఉండమని ఎలా చెప్తున్నావు?
తండ్రిప్రేమ ఎలాగూలేదు,తల్లిని
నేనైనా చూడకపోతే.. ఆబిడ్డలు అనాధల్లా.. "
"లేదు సరోజినీ,అన్నీ ఆలోచన చేశా.నాపెన్షన్ పిల్లలకి నాకు సరిపోతుంది. నీ
జీతం, జీవితం నీవే !ఏబాదరబందీలేని సంబంధం చూస్తాను.సంతోషంగా ఉండు తల్లీ !"
"వద్దునాన్న. అసలా ఆలోచన ఆపండి.పెళ్లితో ఆగిపోదు సమస్య. మరింత జఠిలమౌతుంది.వచ్చినతను
ఈ బిడ్డలను సరిగా చూడరు,పైగా సొంతశిశువు కోసం ఆలోచన... దానితో స్వార్ధం.. గొడవలు.. మీతర్వాత ఆపిల్లలగతి..?
మీకు లోకంతెలీదు నాన్నా.ఆర్ధికంగా కాదు, హార్దికంగా ఆదుకునే వాళ్ళు
ఇప్పుడు ఉండరు.ఉన్నా పక్క
వాళ్ళు ఎగదోస్తారు..
దేవుని ఊరేగింపులో దివిటీల
లాంటి వాళ్ళo నాన్నా మనం,
చమురు పోస్తూఉన్నంత సేపే వెలుగులు.. దైవంపక్కన ఉన్నంత సేపే విలువ..
ఉత్సవాలు అయ్యాక మూలన
పడి ఉండాలి. "అంటూ తోసి
పుచ్చిందట అమ్మ. ఒక సందర్బంగా తాతయ్యే చెప్పాడు మాకు,కాస్త పెద్ద వాళ్ళం అయ్యాక.
ఏదో అలా గడిచేజీవితంలో..
అనుకోని ఉపద్రవం,తమ్ముడికి
పోలియో.. వాడిని బ్రతికించు
కోడానికి యముడితో సావిత్రిలా పోరాడింది అమ్మ.
అయినా ఒక కాలుమాత్రం అవిటిగా కుంటుతూ నడుస్తూ
మిగిలింది సంతోష్ జీవితం !
..... (సశేషం )
ఎం. వి. ఉమాదేవి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి