మన రైతన్న స్థితి పరిస్థితి (కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి,
రాత్రనకా పగలనకా మన రైతన్న
హలం పట్టి పొలం దున్నుతున్నడన్న
తన స్వేదం చిందిస్తూ సాధన చేస్తూ
పంట పండించి మనకందిస్తుండన్న!

బజారులోని పెరిగిన ఎరువుల ధరలు
బేజారైన మన రైతుల నడ్డి విరుస్తున్నవి
వాసిలేని నాసిరకం పలు తాలు విత్తనాలు
మొలకెత్తకుండా రైతుల నిండా ముంచుతున్నవి !

తాను తిన్న తినకున్నా నెట్టుకొస్తుంటడు
తనకున్న దాంట్లోలో ఇతరులకు పెట్టిస్తుంటడు
మకుటం లేని మహారాజు మన రైతన్న
మట్టిని నమ్ముకుని జీవిస్తున్న శ్రమ జీవన్న !

ఆ రైతన్నే మన దేశానికి రారాజు
ఈ రైతే లేకపోతే నడవదు మనకే రోజు
ఆ రైతన్నే మన దేశానికి వెన్నెముక
సై అంటు ఈ దేశం నడుస్తుంది చెకచెక !

పంటకు పెట్టుబడి తన చేతిలోనలేక
పండిన పంటకు పదే పదే తెగుళ్ళు సోక
సతమతమై ఆ రైతు సాగిస్తున్నడు వ్యవసాయం
అతలాకుతలమైన అందిస్తున్నడు ఫలసాయం !

అన్నదాతలను ఆదుకునేవారు లేక
తిన్నగాను ఎండిపోయే అన్నదాతల పీక
ఉన్న దుస్థితిని కని కెసిఆర్ సారు గారు
చక్కదిద్దుటకు స్వయంగా తానే నడుం కట్టినారు !

మనకు ప్రత్యేక తెలంగాణరాష్ట్రం రాకముందు
మన రైతన్న అనుభవించాడు కష్టనష్టాల విందు
ఇట్టి స్థితిగతులను గమనించి మన ముఖ్యమంత్రి గారు
రైతు బీమా రైతుబంధు పథకాలను ప్రకటించినారు !

తానుంటెనె అమలుపరిచే రైతుబంధు పథకాన్ని
వెనువెంటనే తొలగిపోయే ఇక రైతుల వెతలన్నీ
రైతులంతా ఎకరాకు ఐదువేలు అందుకున్నరు
పంట పెట్టుబడికి వాటిని వారు వాడుకున్నారు!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

కామెంట్‌లు