విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు కాలభైరవుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా భైరవ లేదా భైరవుడు శివుని అవతారం భైరవుడు దేశంలో ఒక ముఖ్యమైన దేవుడు;, హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన దేవుడు.భైరవుడు నాగుల్ని చెవిపోగులుగా, దండలకు, కాలికి, యజ్ఞోపవీతంగా అలంకరింబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు. ఇతని వాహనం శునకం.
కాల భైరవుడు మనకి వివిధ క్షేత్రాలలో ఎనిమిది రకాలుగా కనిపిస్తారు :- 1. అసితాంగ భైరవుడు, 2. సంహార భైరవుడు, 3. రురు భైరవుడు, 4. క్రోధ భైరవుడు, 5. కపాల భైరవుడు, 6. రుద్ర భైరవుడు, 7. భీషణ భైరవుడు,, 8. ఉన్మత్త భైరవుడు.
పరమశివుని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురియై భైరవుడిని సృష్టించి బ్రహ్మ దేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. వేంటనే భైరవుడు శివుడని అవమానించిన బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒకదానిని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మ దేవుని కపాలమును చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరకు ఆ కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు ' విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి