చందమామ (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 చందమామ రావె 
జాబిల్లి రావె
పసిడి గిన్నెలో
పాలుపోసి తేవె 
వెండి గిన్నెలో
వెన్న వేసి తేవె
తేరుమీద రావె
తేనెపట్టు తేవె 
బండిమీద రావె 
బంతిపూలు తేవె 
గోడలెక్కి రావె 
గోగుపూలు తేవె 
కొండలెక్కి రావె 
కోటివెలుగులు తేవె
చుక్కలతో మాలలు 
చేసుకొని తేవె
మేఘాల మాలికలు 
అల్లుకొని తేవె
వెన్నెలా ఝల్లులూ 
కురిపించి పోవె
మాపాపా

మాబాబూ
అలిగినారు చూడవే
వేగనీవు రావె
వారి అలక తీర్చవె
కామెంట్‌లు