ఇంటి ముందు మల్లె చెట్ట;-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
ఇంటి ముందు మల్లె చెట్టు
మెల్లె మెల్లిగా ఎదిగి నాది
గుబురు గుబురు తీగలతో
పందిరి వలె  నదిపారినాది

చెట్టు పొదల నడుమ
పిట్టలొచ్చి గూడు కట్టి
సూర్యోదయం వేళలో
కిచ కిచమని అరుపులు

అరుపు విని నిద్ర లేసి
పిల్లలు వెలపల కొచ్చి
వసారాలోన చల్లి నారు
వడ్ల గింజలు కొన్ని వారు

పిట్టలన్ని చూసినాయి
నేలమీద వాలి నాయి
గింజలన్ని బుక్కినాయి
గూటి లోన చేరినాయి


కామెంట్‌లు