అందం (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
మాపాపా మంచిది - మాపాపా మంచిది
మాపాపా అప్పుడప్పుడు - మారాం చేస్తూ వుంటది !!మాపాపా!!

మాపాపకాళ్ళకు వెండిపట్టాలు - అందంగా ఉంటాయి
పట్టాలులేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాప చేతికి బంగారు గాజులు - అందంగా వుంటాయి
గాజులులేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాప చెవులకు బంగారు దుద్దులు - అందంగా వుంటాయి 
దుద్దులులేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాప ముక్కుకు వజ్రపు పుడక - అందంగా వుంటుంది
పుడకలేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాప మెడకు బంగారు గొలుసులు - అందంగా వుంటాయి 
గొలుసులులేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాప జడకు బంగారు గంటలు - అందంగా వుంటాయి 
గంటలులేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాప నడుముకు వడ్డాణము - అందంగా వుంటుంది
వడ్డాణంలేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!

మాపాపకు చక్కని పట్టుపావడా - అందంగా వుంటుంది
పావడాలేక మాపాప - మారాం చేస్తూ వున్నది !!మాపాప!!


కామెంట్‌లు