నిదురపోరా (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
నిదురపోరా బాబు నిదురపోరా తండ్రి 
నీకొరకు పదమునే పాడెదను కదరా
!!నిదుర!!

బూచాడు ఆమూల నిన్నె చూస్తున్నాడు 
నిదుర పోకుంటేను నిన్నెత్తు కెళతాడు
నిదుర పోకుంటేను నిన్నెత్తు కెళతాడు
!! నిదుర!!

మాయలోడీమూల నిన్నె చూస్తున్నాడు
 నిదుర పోకుంటేను నిను మాయజేసేను 
నిదుర పోకుంటేను నిను మాయజేసేను
!! నిదుర!!

అటకమీది పిల్లి నిన్నె చూస్తున్నాది 
నిదుర పోకుంటేను నిన్నెత్తు కెళతాది 
నిదుర పోకుంటేను నిన్నెత్తు కెళతాది !!నిదుర!!

ఇంటి మీది కాకి నిన్నె చూస్తున్నాది
 నిదుర పోకుంటేను నిన్నెత్తు కెళుతాది
నిదుర పోకుంటేను నిన్నెత్తు కెళతాది
!! నిదుర!!

నిదురబొయి లేస్తే రామన్న వచ్చేను
 నిదురబొయి లేస్తే కృష్ణయ్య వచ్చేను 
పిల్లలంతా కలిసి ఆడుకోవచ్చురా 
పిల్లలంతా కలిసి ఆడుకోవచ్చురా
!!నిదుర!!


కామెంట్‌లు