రాత్రిళ్లు నిద్రలేదు.ఏదో ఘర్షణ
అంతరంగంలో చివరికి ట్యూబ్
లైట్ వెలిగినట్లు ఒకటి గుర్తు
వచ్చింది.సౌమ్య సంతోష్ ని
లోపంతో సహా ప్రేమించిo దని
తెలిసాక,నేనెలా ఇష్టపడ్డాను
ఆమెని అని... కొన్ని కొన్ని విషయాలు లాజిక్ కి అందవు.
ధృఢమైన మనసుతో ఇక ఆ
విషయం వదిలేయాలని అనుకున్నా.
అమ్మ ఆనందంగా సౌమ్య
వాళ్ళమ్మ గారిని రమ్మని చెప్పింది.వాళ్ళ బంధువులతో
కలిసి పదిమంది వచ్చేసరికి ఇల్లు కళకళలాడుతుంది.సంతోష్
అత్తగారికి ఇద్దరు అక్కలున్నా
రట.వాళ్ళు కూడా వచ్చారు
భర్తలతో.మా కుటుంబం బాగా
నచ్చింది వాళ్ళకి.
" మీ వియ్యపురాలు మంచి
మనసు,నీకు లాగే.. మాపిల్లల్ని
నీపిల్లల్లాగే పెంచావుగా.. ఆ పుణ్యం సౌమ్యకోసం అమ్మ లాంటి అత్తయ్య నిచ్చాడు పై వాడు, !"అంటూ ఉంది ఒక అక్కగారు సౌమ్య వాళ్ళమ్మతో
పైవారమే నిశ్చితార్ధం పెట్టుకో వాలని అనుకున్నారు.అమ్మ
భోజనం చేసవెళ్ళండి అంటున్నా,ఇప్పుడు కాదమ్మా
కతికితే అతకదు అంటారు అని
నవ్వుతు వెళ్లారు.
సంతోష్,సౌమ్య నిశ్చితార్ధం
ముందురోజే వచ్చేసారు.ఒకటే
ఫోన్ ముచ్చట్లు.మా మేనమామలు, వాళ్ళ పిల్లలు
నాన్నకు తమ్ముడు మా బాబాయ్, పిన్ని వచ్చారు మా
తరఫున. రెండు వ్యాన్లలో
సౌమ్య వాళ్ళఇంటికి వెళ్ళాము.సాదరంగా ఆహ్వానించినారు.పలకరింపులు అయ్యాక పంతులుగారు
వచ్చి తాంబూలాలు మార్చు కునే పద్ధతి చెప్పి అందర్నీ
రెండు బృందాలుగా కూర్చోబెట్టి
సూచనలు ఇస్తూఉన్నారు.
నెమలి రంగు పట్టుచీరలో
సౌమ్య అద్భుతంగా ఉంది.కానీ
ఏదో తేడా..
పూలు పండ్లు తాంబూలాలు
మార్చుకున్నాక, జంటని
ఉంగరాలు మార్చుకో మని
చెప్పారు.వీళ్ళే బెంగళూరులో నే కొనుక్కున్న లవ్ బాండ్స్
ఒకేలా ఉండేవి మార్చు కున్నాక
పూల మాలలు ఫోటోలు.
ఇద్దర్నీ ఆశీర్వదిస్తున్నారు అక్షింతలు వేస్తూ...
పెద్ద వాడుకదా దర్శన్ కూడా
వేయాలి అంటూ నన్ను లేపారు
మొహమాటo గా వెళ్లి అక్షింతలు వేస్తూ,యధాలాపంగా ఒకవైపు
చూసిన నేను, స్థబ్ధుగా అలా ఉండి పోయా!మైండ్ ఖాళీ...
అక్కడ...మూలగా ఒక కుర్చీలో ఆమె... సౌమ్య లా..
అచ్చం, వడిలో రెండేళ్ల పిల్లాడు !
మౌనంగా చూస్తూఉందామె.
అందరు వచ్చి అక్షింతలు వేసి
వెళ్తూ ఉన్నారు, ఆమెని ఎవరూ పిలవడం లేదు..
కలలో లాగ మిగతా కార్యక్రమం పూర్తిచేసి ఇంటికి
వచ్చా అమ్మ వాళ్ళతో...
ఓరి దేవుడా.. మళ్ళీ ఇదో పరీక్ష ! ఆరోజు నేనుసౌమ్య వాళ్ళింట్లో చూసింది ఈమెనే !
అదే పోలికలు,వాళ్ళ పెద్దమ్మ
వాళ్ళ అమ్మాయి అయిఉండాలి.వివాహిత, కానీ
ఆమె భర్త పక్కన లేడే.. ఆమె
ముఖంలో విషాదరేఖలున్నట్లు
అనిపించింది అది నా భ్రమ కావచ్చు.
అంతులేని ఆలోచనల సుడిగాలిలోనే పెళ్లిరోజు వచ్చేసింది. సింపుల్ గా గుడిలో
పెళ్లి జరిపించాము.సంతోష్ కోరిక ప్రకారం పెళ్లి ఖర్చులు
తగ్గించి ఊరిలో ఉన్న చిల్డ్రన్స్
హోమ్ లో బట్టలు,పుస్తకాలు
డబ్బు పంచాము.
వారానికి యిక సెలవులు లేవని కొత్త జంట ప్రయాణం..
వాళ్ళతో అమ్మ కూడా వెళ్లిo ది.
మధ్యలో ఒక రోజు సంతోష్ ద్వారా తెలుసుకున్నా.. ఆమె పేరు కవిత.టీచర్ గా పని చేస్తున్నా సౌమ్య వాళ్ళ అమ్మ
గారిఇంట్లో నే ఉంటుంది. నేను
వెళ్లిన రోజు సౌమ్య అసలు లేదు ఇంట్లో.బయటకి వెళ్లి బైక్
రిపేర్ కావడం తో రాలేక పోయిందట.కవితకు భర్త లేడని పెళ్ళైన కొన్ని నెలలకే
పోయాడని చెప్పాడు తమ్ముడు.
ఇప్పుడేo చెయ్యాలి? ఇదేదో
గట్టి బంధంగానే ఉంది.. లేకుంటే ఇదంతా ఏమిటి... ఈ
భావనలు నన్ను పట్టుకొని వదలడం లేదు. అమ్మ ఊరు వెళ్ళింది కాబట్టి.. పొద్దున్నే టిఫిన్ చేసి తాతయ్యకు పెట్టడం, అంత పప్పు అన్నం వండేసి, నేను బాక్స్ పెట్టుకొని
తాతయ్యకు అన్ని అమర్చి వెళ్లి
సాయంత్రం కాలేజ్ నుండి వచ్చే
సరికి తాతయ్య టీ రెడీ చేసి
ఉంటారు. ఇద్దరం బయట పూల మొక్కల దగ్గర కూర్చొని
పిచ్చాపాటి !
తాతయ్య కాలేజీ సంగతులు అడిగితే చెప్పడం, ఆయన చెప్పే లోకం సంగతులు వినడం !
...... . (సశేషం )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి