పాంచభౌతిక దేహులం... పంచ భూతాలతో సయ్యమనమే...
మానవులసుఖ,సౌఖ్యరహస్యం
అహంకరించి... విర్రవీగితే....,
అశాంతి, ఆందోళనలే... !
ప్రకృతి శక్తుల సహజ స్వభావా లకువిఘాతంకలిగిస్తే..ఆవికృత విజృంభణలను ఈ మనిషి తట్టు కోగలడా... ?!
ఉపకారంచేస్తున్న మిత్రులచేతే
అపకారాన్నిచేయించుకుంటున్న
అవివేకులమైపోతే ఎలా... !?
హాయిగా చలికాచుకోమంటే...
చేతులుకాల్చుకునే వైనం !
ఓ మనిషీ.... నీ వికసించిన
విజ్ఞానానికి పొందవలసిన ఫలితమిదేనా... !!
ప్రకృతి శక్తులను ఆరాధించు...
ఆనందంగా జీవించ గలుగుతావ్ !
అదుపుచేసి, అణగద్రొక్కి, అధికారం చలాయించజూస్తే...
అవి నీలాంటి మనుషులుకావు
అత్యంత శక్తివంతమైన ప్రకృతి శక్తులు !పంచ భూతాలవి !
తస్మాత్.... జాగ్రత్త !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి