శివ స్మరణ;-మచ్చ అనురాధ--సిద్దిపేట
ఉత్పలమాల.
వేములవాడ యందునను; వేలుగ భక్తులు జేర సన్నిధిన్ ,
భామలు గొల్చి వేడెదరు;  బాలలు, భర్తల తోడగూడియున్ ,
మోముగ వేడ్కతోడగని; ముద్దుగ దీవెనలిచ్చె శంకరా! ,
స్వామియు నీవె మమ్ములను సాకగ   రాగదె  నంది వాహనా! .

చంపకమాల
శివ శివ యన్న పాపములు; చి త్తుగ బాయును పాపమెల్లయున్
భవహర నీదు పాదములు; భక్తిగ గొల్చిన ముక్తిగల్గునే! ,
యవనిన భక్త వర్యులును;  నాత్మన వేడిన నాదు కొందువే! ,
ధవళగిరీశ మాదరికి;  తప్పక రమ్ముర  మమ్ము బ్రోవగన్ .

చంపకమాల
సురముని యోగిపుంగవులు;  సొంపుగ  నాట్యము నాడు చుందురే ,
నిరతము  నామ కీర్తనలు; నీ దరి జేయుచు సంతషించెరే! ,
వరముల నిచ్చె దేవుడని;  వాసిగ భక్తులు  గొల్చుచుందు రే! ,
సురవర లోక పూజ్యుడవు;  సుందర రూపుడ మమ్ముబ్రోవరా! .

ఉత్పలమాల
ఆరయ నాది దేవుడవు; నంబ పరాత్పర శంభొశంకరా! ,
కూరిమి మీర మిమ్ములను; కోరి భజించగ  లోకనాయకా! ,
నేరము లెన్న కెప్పుడును; 
నీ దయ జూపర నీలకంఠ మా ! ,
భారము నీదెమాకిలను;  పార్వతి యీశ మహేశ శంకరా!.

ఉప్పల మాల
తెల్ల విభూతి పూసుకొని; దేహము నెల్లను దివ్యకాంతిగన్ ,
మెల్లగ రుద్ర మాలగొని; మిన్నగ ధ్యానము జేయుచుందువే! ,
చల్లని చూపు తోడ మము;  సాంబ సదాశివ బ్రోవరావు రా! ,
యెల్లసు వేళలందు నిను;  యీశ్వర  మా మది  వేడుకొందుమే! .



కామెంట్‌లు