పూవులు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
పూవులమ్మ పూవులూ
రంగురంగుల పూవులూ 
తోటలోని పూవులూ తెంపి తెచ్చాము 
పళ్ళెముతో పూవులూ పట్టుకొచ్చాము 
బండిమీద పూవులూ పోసుకొచ్చాము
ఒద్దికతో ఈ పూవులు వేయిపూవులూ 
రెమ్మలతో ఈ పూవులు రెండువేయిలూ
 ముచ్చికలతో ఈ పూవులు మూడువేయిలూ  
నవ్వేటి ఈ పూవులు నాలుగువేయిలూ 
ఆకుతో ఈ పూవులు ఆరువేయిలూ 
తొడిమతో ఈ పూవులు తొమ్మిది వేయిలూ 
పూవులతో మీరంతా పూజలు చేయండీ 
మీ కోరికలు తీరాలని దేవుడిని కోరండీ !!


కామెంట్‌లు