మన్మథుడు.పురాణ బేతాళ కథ.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు మన్మథుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా మన్మథుడు హిందూ పురాణాలలో ప్రేమకు సంబంధించిన దేవుడు. ఇతని భార్య రతీదేవి.
మన్మథునికి శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్య పురాణము, శివ పురాణములలో తెలుపబడినవి. 
ఇంద్రుడు,ఇతరదేవతలను తారకాసురుడు బాధించసాగెను. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని మన్మథుడు చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల బాణంతో మేల్కొలుపుతాడు. కోపించిన శివుడు మూడవకన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు.
వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు కార్తికేయుడు తారకాసురున్ని వధిస్తాడు.
మన్మథునిరూపంఅందమైన,యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు చెఱుకు గడతోను, బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి. ఈ పువ్వులు: అశోకం, తెలుపు, నీలం పద్మాలు, మల్లె, మామిడి పూలు.  రతి, ప్రీతి భార్యలతో కామదేవుడు.
కామ గాయత్రి : "ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్"
మదనుడు
కాముడు
కామదేవుడు
మనసిజుడు
అనంగుడు
కందర్పుడు
రతికాంతుడు
పుష్పధన్వుడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
x
కామెంట్‌లు