రుబాయిలు--నెల్లుట్ల సునీత
వెలుగు రేఖలు విచ్చుకున్నవెందుకో
 ఉదయ సమీరం తాకినాదెందుకో
గుండె కవాటాల నొక్కిన బాధలె 
అనుభూతులయ్యి ఆవిరయ్యే దెందుకో

చెమట అంతా కన్నీళ్లతో కలిసిపోయింది 
శ్రమకు  తగినట్టి ఫలితమేమి లేకపోయింది
గుండెలో మంటలన్ని చల్లారేదెపుడో?
చరిత్రలోన రైతు విలువ  జారిపోయింది

కామెంట్‌లు