మా పల్లె ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

(ఆట వెలదులు )
పల్లె మాది చూడు పరవశమ్మొనరించ
పచ్చ పచ్చని వరి పంట చూడు 
బాటలోన సాగు బండియెద్దుల చూడు 
మూగ జీవి స్వేచ్ఛ మొదలె జూడు !

గాలినీటి తీరు గమనించి చూడుము 
పక్షిజాతులెన్నొ పాడుచుండు 
సూర్య చంద్ర వెలుగు  సూటిగా ప్రసరించు 
రాత్రి పల్లె నిండ రమ్య శాంతి !!
కామెంట్‌లు