విప్లవజ్యోతి అల్లూరి;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్విశాఖపట్నం

 దేశం నాకెమిచ్చిందని గాక దేశానికి నేనేమి చేశానని
భరతమాత దాస్య శృంఖలాలను విడిపించేందుకు
విప్లవమే సాధనంగా చేసుకుని అదరక బెదరక
బ్రిటిష్ దొరల గుండెల్లో సింహస్వప్నమై
ప్రాణాలను తృణప్రాయంగా తలచి
వన్యప్రజలను స్వాతంత్రోద్యమలో పాల్గొనేటట్లు
చైతన్య పరచి తెల్లదొరలను ఎదిరించి  ప్రజలపాలిట శ్రీరామచంద్రుడవై మదిలో నిలిచి,సాయుధపోరాటం 
చివరివరకుచేసి రూథర్ ఫర్డ్  కుటీలనీతికి బ్రిటిష్ వారి తూటాలకు
అమరుడవవుతు కూడా దేశభక్తి  వీడక"వందేమాతరం" అంటు నినదిస్తు ప్రాణత్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డ తెలుగుజాతి పౌరుషమా అల్లూరి సీతారామరాజు
ఇరువది ఏడేండ్ల వయస్సులోనే విశ్వవిఖ్యాతి పొందిన మహనీయులు.
జాతిపిత మహాత్మునిచే ఆశయాలు వేరైన ఆశయం ఒకటేనని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చే అసలయిన దేశభక్తుడు అల్లూరి వారి అడుగుజాడలే నాకు  మార్గదర్శనం అనడం
మీ  దేశభక్తి కి ప్రతీక
అందుకోండి విప్లవజ్యోతి నూటముప్పది కోట్ల భారతీయుల వందనములు....!!
..............................

కామెంట్‌లు