చీమనడుం! అచ్యుతుని రాజ్యశ్రీ

ఓచిట్టిచీమ అమ్మమ్మ ఇంటికి బైలుదేరింది.ఒక ధాన్యపుగింజను నెత్తిపై మోసుకుంటూ వెళ్తోంది. చెట్ల మధ్యలో వెళ్తూ దారికి అడ్డంగా నించున్న కప్పని చూసి "కప్పమామా!నాకు కాస్త దారి ఇవ్వు. మా అమ్మమ్మ కి ధాన్యం మోసుకువెళ్తున్నా"అడిగింది. "అబ్బో!నలకంతలేవు నీకు  ఆకాస్త సందు చాలదా?"గద్దించింది కప్ప."మామా!తలపై బరువుంది.దారివిడుమామా!" కానీ కప్ప ససేమిరా అంది.చీమ చేసేదేమీ లేక నక్కి నక్కి పోతుంటే కప్ప దాన్ని  నొక్కసాగింది.కీచుకీచుమని బాధ కోపం కసితో చీమ కప్పను కసుక్కున కొరికింది.బాబోయ్ అని అరుస్తూ  కప్ప గెంతింది.అంతే!పైనున్న  దోరమామిడి కాయను కొరుకుతూ ఉన్న ఉడుత తృళ్లిపడి ఎగిరింది.ఆజోరుకి మామిడి కాయ కప్ప నడుంమీదపడి అదికుయ్యో మొర్రో అని మొత్తుకోసాగింది.కప్ప ఏడ్పుకి బెదిరిన పిచుక అటుగా వెళ్తున్న ఏనుగుచెవిలో దూరింది.ఏనుగు చెవిపోటుతో భయంకరంగా ఘీంకరిస్తూ అక్కడ ఉన్న రాతి గుట్టకు తలను బాదుకుంది.పైనించి ఒక పెద్ద బండరాయి దొర్లుతూవచ్చి ఊరేగింపు గా బైలుదేరిన రాజపరివారంపై పడటం రాజు గారి చిన్నకొడుక్కి దెబ్బ తగిలి వెంటనే ప్రాణంపోవటం కనురెప్పపాటులో జరిగింది. రాజు బండరాయి తో"నాకొడుకు నీకేమి అపకారం చేశాడని దొర్లి వాడి ప్రాణం తీశావు?" అని అడిగాడు. "ప్రభూ!ఏనుగు తన కుంభస్థలం తో గుట్టని మోదటంతో నేను కదిలి దొర్లాను.నాతప్పేమిలేదు."  సరే రాజాజ్ఞతో ఏనుగు ని ఈడ్చుకుని వచ్చారు భటులు. "ఏనుగూ!బండరాయి ని ఎందుకు దొర్లించావు?" "రాజా!నాచెవిలో పిచ్చుకదూరి పిచ్చెక్కించింది.నాదోషంలేదు".
"పిచ్చుకా!ఏనుగు చెవిలో ఎందుకు దూరావు?" "కప్ప బెకబెక ఏడ్పుకి బెదిరాను ప్రభూ!" "ఏంమండూకమా?నీకింత కండకావరమా?" "ఉడత నాపై మామిడి కాయ ను పడేసింది ప్రభూ!" ఉడత మూలుగుతూ అంది"రాజా!కప్ప దే తప్పు అంతా!"అంతే రాజు  కప్పని ఛడామడా తిట్టాడు. "నన్ను చీమ గట్టిగా కొరికింది ప్రభూ!"అని ఏడ్పు లంకించుకుంది."సరే చీమ అసలు దోషి అన్న మాట!" అని చీమ ను సంజాయిషీ అడిగాడు రాజు. "కప్ప నాకు నడిచేందుకు దారి ఇవ్వలేదు. నెత్తి పై బియ్యం గింజ బరువు తోవిధిలేక కొరికాను"అని నిజం చెప్పింది."ఊ! నీవు కప్ప  నాకొడుకు చావుకి కారకులు. చీమ నడుంకి గట్టి దారాన్ని  బాగా బిగించి కట్టండి.దురదగొండి ఆకుల్తో కప్ప ఒళ్లు అంతా రుద్దండి. ఇదే వీటికి  తగిన  శిక్ష."అంతే అప్పటినుండి చీమ కి నడుంసన్నగా ఐంది. కప్ప చర్మం  చారలు జిగటగా  లూజులూజుగా మారింది. 🌷
కామెంట్‌లు