"నీ" మంత్రం; -:డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి,మేడ్చల్.

 నీకు నీవే బలం
నీకు నీవే ధైర్యం
నీకు నీవే సాహసం
నీ మార్గం ధృడం
నీ కర్తవ్యనిర్వహణే విజయం
నీ ఆశే నీకు అమృతం
నీ కృషే నీకు పెట్టుబడి
నీ ధర్మం నీకు రక్ష
నీ నిజాయితీ నీకు సంపాదన
నీ మాటలే పునాదులు
నీ మనసే నీ ఆయుధం
నీ చేతలే భవిష్యత్తు
అడుగులొక్కటొక్కటే వేస్తూ
అనుకున్నది సాధిస్తూ
పురోగమించుటే మంత్రం.
అడ్డంకులు ఛేదించుకొని
అవనిపై నిరంతర ప్రయాణం.
అవకాశాలు అందిపుచ్చుకొని
అనితర సాధన చేసేస్తూ
నిత్యచైతన్యమవుతూ
జీవనసాఫల్య మొనరించుకొనుటే
అతి ముఖ్యమైన లక్ష్యం.
నడక కొనసాగాలి
నడత దర్పణం కావాలి
నిన్ను నీవు గెలవాలి
నీవే నీకు తెలియాలి
నిజం నీడన నిలవాలి
అనేకం నుండి విడివడుతూ
నీలో నీవు మమేకమవ్వాలి.
కామెంట్‌లు