జీవితం ------సుమ.

 జీవితం ఓ తీయని దాహం !
ఎన్నటికీ తనివి తీరని ఓ దప్పిక !
ఒక ఆశ నెరవేరిందనుకుంటే 
మరో ఆశ చిగురులేస్తుంది ... 
కొంతకాలం జీవితావగాహన లేకుండానే 
అవకాశాలు చేజార్చుకుంటాము 
అన్నీ అర్థమయి అందిపుచ్చుకుందామనుకుంటే
అనుభవాలు అందని ద్రాక్షలవుతాయి 
జారిపోతున్న కాలం వెక్కిరిస్తుంది 
అనుకూలత ప్రతికూలతల మధ్య 
అనుక్షణం పుడుతోంది తీరని దాహం !... 
ఓ తీయని దాహం !....

కామెంట్‌లు