స్వధర్మం;-మచ్చ అనురాధ--సిద్దిపేట
చంపకమాల
పరుషపు మాటలాడకను;  బాధ్యత లన్నియు నిర్వహించు చున్ ,
నిరతము  జేయు వృత్తి నను;  నేర్పును జూపుచు దైవసేవగన్
జరుపుము కార్యమెల్లయును;  జాఢ్యము  చెంతకు జేరనీయకన్ ,
పరమము నెంచి సల్పినను;  పావనమౌ నిదియే స్వధర్మమున్ .

కందం
పరులను  జూడకు నెప్పుడు
మరువకు ధర్మంబు నీవు మానస మందున్ ,
వరముగ నెంచుము వృత్తిని
పరిధిని దాటకను జేయు  పనులను  మిన్నన్ .


కామెంట్‌లు