ఉడుత (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఉడుతా ఉడుతా ఓ ఉడుతా 
బుడిబుడి నడకల ఓ ఉడుతా 
ఎక్కడి కెళ్ళావ్ ఓ ఉడుతా 
ఏమి చేశావ్ ఓ ఉడుతా 
రాముని సేవకు వెళ్ళాను 
వానర మూకతొ కలిశాను 
వారిధి నేను కట్టాను
భక్తితో భజనలు చేశాను 
రాముడు నన్ను మెచ్చాడు 
చెంతకు రమ్మని పిలిచాడు
మూడు నామాలిచ్చాడు 
ముచ్చటగా నను చూశాడు 
ఆశీస్సులను ఇచ్చాడు !!

కామెంట్‌లు