విద్యకు మూలం! అచ్యుతుని రాజ్యశ్రీ

 విద్యకు మూలం శ్రద్ధ భక్తి!చెట్టు కి వేళ్ళు ఉంటేనే అది భూమి నుంచి నీరు ఖనిజలవణాలు స్వీకరించి పెరిగిపెద్దదవుతుంది.నారాయణమాష్టారు పాఠం చెప్తుంటే పిల్లలంతా చెవియొగ్గి నోరుతెరుచుకుని వింటారు. ఆరు ఏడుక్లాసు పిల్లలకి చెప్పింది త్వరగా నాటుకుంటుంది.అదే పెద్ద క్లాస్ వారి కి మార్కులు రాంకుల గొడవ తప్ప వేరేవి బుర్రకి ఎక్కించుకోరు.ఆరోజు స్వామీ వివేకానంద జ్ఞాపకశక్తి నిగూర్చి  మాష్టారు చెప్తుంటే అంతా అలా చెవులప్పగించి వింటున్నారు.ఓసారి ఓడలో స్వామి తోపాటు ఓ ఆంగ్ల రచయిత ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడు.అతను  స్వామివివేకానంద కి తనురాసిన  నవల చిత్తుప్రతిని ఇచ్చి చదవమన్నాడు.ఆయన దాని పేజీలు గబగబా తిప్పేసి ప్రతి అక్షరం క్షుణ్ణంగా బుర్ర లోకి  ఎక్కించుకున్నారు.అకస్మాత్తుగా ఆచిత్తుప్రతికాస్తా చేతిలోంచి జారి సముద్రంలో పడిపోయింది. తను కష్టపడి రాసిన నవల నీటిపాలు కావటం బాధాకరమే! అతను విసురుగా "నానవలను నాకు ఇచ్చేయి"అని  దెబ్బలాటకు దిగాడు. "అయ్యా!మీరు కాగితం కలం పట్టుకోండి.మీనవలను తు.చ.తప్పక చెప్తాను. ప్రతి అక్షరం నాకు గుర్తు ఉంది. మీరు రాసుకోండి "అన్నాడు. "ఉహు!మొత్తం నీవే రాయి"కోపంతో అరిచాడు ఆంగ్లేయుడు.స్వామీజీ ఒకేఒక్క గంటలో మొత్తం నవలరాసి అతని చేతిలో పెట్టేటప్పటికి డంగైపోయాడు.మక్కికి మక్కీ తన నవలను రాసిచ్చిన స్వామి పాదాలపై పడి పశ్చాత్తాపం తో క్షమాభిక్ష వేడాడు...మాష్టారు చెప్పిన కథవిని రోహిత్  ఇంటికి వెళ్లగానే "అమ్మమ్మా! మాసారు స్వామి వివేకానంద గూర్చి చెప్పారు. జ్ఞాపకశక్తి పెరగటానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా?"అని అడిగాడు. "ఏరోజు బడిలో చెప్పిన  పాఠం ఆరోజు చదివితే చాలు. ఫలహారం  భోజనం  ఎలా టైంప్రకారం తింటామో అలాగే అన్ని సబ్జెక్టులు ఏరోజువి ఆరోజు చదవాలి. తెలీనివి వెంటనే ఎవరినైనా అడిగి చెప్పించుకోవాలి సరేనా?" మంచి పాజిటివ్ భావాలు చేయగలను అనే ఆత్మ విశ్వాసం ఉంటే దేవుడు సాయపడతాడు అనుకుంటూ కాసేపు ఆడుకోడానికి బైట కి వెళ్ళాడు రోహిత్ 🌷
కామెంట్‌లు