సాయపడుతూ సాగుదాం;-డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.
 అలుపెరుగని ఆరాటాలా,
ఎడతెగని జీవన పోరాటాలా,
ఒత్తిడి చిత్తడిలో,
మెదడులకి పని చెప్పి,
మనసు లయల 
స్తితులు తప్పి,
కడుపులు నిండగా,
కలతలు తీరగా,
డబ్బులు చేతికి
దండిగా, అందగా,
డ్రామాలు నేర్చి,
తీరును మార్చి,
తలదన్నే తీరాలను
తలచి, 
తలపుల 
తపనలలో 
జీవించడమే మరచి,
నాలుగు గోడల
మధ్య నలుగుతూ,
నల్లని అద్దంలో 
కనిపించని ప్రతిబింబాన్ని
పదే పదే వెతుకుతూ,
గతి ఎరుగని 
గమ్యాలకు 
చేరువవుతూ,
మనకు మనమే
మొత్తంగా
దూరమవుతూ,
అసలు ఎంతకీ 
అర్ధమేకాని ఈ జీవన 
ప్రయాణంలో
మనసేలేని మరమనిషిలా
మారాము!!!!!
మనము 
మనసున్న మనుషులమే 
అన్న విషయాన్నే
మరిచాము!!!!!
భరోశానే లేని మన బ్రతుకు చిత్రంలో....
కనికరం లేని కాలం ఒడిలో
కీ ఇస్తే ఆడే కీలు 
బొమ్మాల్లా మారడం ఎందుకు??
బ్రతికినన్ని రోజులైనా సాటివారికి
సాయపడుతూ సాగుదాం
ముందుకు మునుముందుకు????


కామెంట్‌లు