చిరమిత్రుడు ;- ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు
:ఆట వెలదులు 

బుద్ధమార్గమునను బోధన రమ్యమ్ము 
శాంతి సహనములకు సాధనగును 
కరుణలేని చోట కనకమ్ము లేలనో 
సంఘధర్మశరణు సత్యశోభ !

పుస్తకమ్ములిచ్చు పుణ్యమ్ములెన్నియో 
మస్తకమ్ము నిండ మంచినిల్చు 
బాల్యమెంతఘనము బాలకవులునేడు 
పుస్తకాలవలన పొందెయశము!!

కాశిమజిలికథలు కావ్యమ్ము లెన్నియో 
చిన్ననాడెజదివి చింతలేక 
ప్రాచ్య దేశఘనత ప్రఖ్యాతరచనలె 
నోబెలందుకున్న నూత్నరచన !!

దిగులు తొలగునట్టి దివ్యకాంతియునేదొ 
పొత్తములను జదువ చిత్తమందు 
గ్రంథరాజములకు గ్రహణమ్ము బట్టెనే 
వెనుకబడినడిపుడు విద్యలోను !!


కామెంట్‌లు