అల్పం-అనల్పం! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 విక్టర్ హ్యూగో తన నవల"లేమిజరబుల్" ఎలా అమ్ముడుపోతున్నదో తెలుసుకోవాలని పబ్లిషర్ కి ఇలా టెలిగ్రాం ఇచ్చాడు"?" దాని కి అతనిచ్చిన జవాబు "!"
ప్రపంచంలో అతిచిన్న టెలిగ్రాం సందేశం గా రికార్డు సృష్టించింది.
ఆల్ఫ్రెడ్ నోబెల్ అవివాహితుడు. ఇటలీలో ఓకొత్త ఇల్లు కొనుక్కుని దానికి "మినో నిడో" అని పేరు పెట్టాడు."నా గూడు"అని దాని అర్ధం. "ఒంటరి వాడివి!బ్రహ్మ చారివైన నీవు ఈపేరు పెట్టడం సబబు గా లేదు. గూడు అంటే పక్షుల జంట కట్టుకునేది"అన్నాడు. అంతే నొచ్చుకోకుండా వెంటనే "నోబెల్ విల్లా"అని పేరు మార్చిన సహృదయుడు ఆయన!నోబెల్ బహుమతులు ఏర్పాటు చేసిన  అజరామరుడు!
సర్.వాల్టర్ రేలే రాజకీయ కారణాల వల్ల టవర్ ఆఫ్ లండన్ జైల్లో ఉన్నాడు.ప్రపంచ చరిత్ర రాయాలని ప్రారంభించాడు.ఓరోజు రాసుకుంటూ ఉండగా జైలు బైట ఏదో పెద్ద గొడవ విన్పడింది. కిందకెళ్లి జైలర్ ని అడిగాడు.…
 హెన్రీ జేమ్స్ గొప్ప ఆంగ్ల నవలారచయిత. అతని పొరుగింటివ్యక్తి కి ఇతనంటే గిట్టదు.అసూయతో సూటిపోటిమాటల్తో జేమ్స్ ని సతాయించేవాడు.పాపం జేమ్స్ నోరెత్తేవాడకాదు.ఆపొరుగాయనభార్య కి బాగా జబ్బు చేసి ఆరోజు పెద్ద పెద్ద గా కేకలు వేస్తుంటే జేమ్స్ అతని ఇంటికి వెళ్లి విషయం కనుక్కుని డాక్టర్ ని తీసుకుని వచ్చాడు. "నేను నిన్ను ఎంత ద్వేషించి మాటలతో కుళ్లపొడిచినా నన్ను ఆదుకున్న దేవుడివి!"అతను అంటే జేమ్స్ నవ్వుతూ "నేను నిన్ను ఎప్పుడూ మిత్రుడిగానే భావిస్తున్నాను "అనటంతో కన్నీరు మున్నీరు ఐనాడు. అతని పేరు బైట పెట్టని విశాలహృదయం హెన్రీ జేమ్స్ ది!
లార్డ్ టెనిసన్ బాల్యం లోనే చిట్టికవిత అల్లి"బామ్మా!నీమీద కవిత రాశాను. నీవు చనిపోయాక నీసమాధిపై చెక్కిస్తాను"అన్నాడు. "నాబంగారు తండ్రీ!"అని "ఈపది షిల్లింగులు నా మొదటి చివరికానుక."కొన్నాళ్ళకి ఆమె రాలిపోయింది.తన మనవడు గొప్పగా కవితలల్లి ఎంతో డబ్బు సంపాదించుతాడని ఆమె ఊహించలేదు. 
సర్ ఆర్ధర్ కానన్ డయల్ మిష్టరీ  పునర్జన్మ ఆత్మల కథలు రాయడం లో అందెవేసిన చెయ్యి! అతని మిత్రుడు రచయిత చనిపోయాడు.ఎవరో అడిగారు"మీరు ఆమిత్రుని ఆత్మతో మాట్లాడారా?"  ఆర్ధర్ ఇలా జవాబిచ్చాడు"అతనితో నాకు విరోధం రావటంతో మామధ్య  మాటామంతీ లేవు.ఇక అతని ఆత్మతో మాట్లాడే అవకాశం లేదు. "అంతే ఆవ్యక్తికి  నోటమాటరాలేదు. 
ప్రఖ్యాత రచయిత వాల్టర్ స్కాట్ ఓమంచిపనికోసం విరాళాలు వసూలు చేస్తూ ఓసభని ఏర్పాటు చేశాడు. ఫండ్ ఆవశ్యకతను గురించి మాట్లాడుతూ ఉంటే వాలంటీర్ అతని టోపీ తీసుకుని ప్రేక్షకుల మధ్యకి వెళ్లాడు.ఎవరూ చిల్లిగవ్వకూడా అందులో వేయలేదు. తనఖాళీటోపీని చూసి "థాంక్స్!కనీసం నా హ్యాట్ ని సురక్షితం గా నాకు అందించినందుకు.మీకు ధన్యవాదములు "అన్నాడు హాస్యం వ్యంగ్యం మిళాయించి!
రుడ్ యార్డ్ కిప్లింగ్ చనిపోయాడు అన్న వార్తను పేపర్లో చూసిన ఆయన  వెంటనే ఎడిటర్ కి ఫోన్ చేశాడు "మీరు అసలు సిసలు నిజమైన వార్తలనే ప్రచురిస్తారు.నేను చనిపోయిన వార్త కూడా నిజమే అయిఉంటుంది.మీచందాదారుల లిస్ట్ లో నాపేరు తొలగించాల్సినదిగా కోరుతున్నాను. "
అంధుడైన జాన్ మిల్టన్ భార్య చాలా అందగత్తె కానీ మహాగయ్యాళిగంప!ఓమిత్రుడు ఊరడింపుగా అన్నాడు "మీఆవిడ సుకుమారి!గులాబీ అందాలు ఆమె సొంతం!"పాపం  ఏడ్వలేక నవ్వుతూ  మిల్టన్ అన్నాడు "కానీ  నాకు ఎప్పుడూ గులాబీ ముళ్ళు మాత్రమే గుచ్చుకుంటున్నాయి." అందుకే పారడైజ్ లాస్ట్ రాశాడుకాబోలు!!?🌹

కామెంట్‌లు