మాతృదేవోభవ; -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,మేడ్చల్.

 అమ్మ అనే రెండక్షరాలు
అనంతమైన ప్రేమకు ఆనవాళ్ళు.
అవ్యాజ్య అనురాగానికి,
అమేయమైన త్యాగానికి,
నిదర్శనంగా నిలుస్తుంది తల్లి.
ఆదిగురువుగా జ్ఞానాన్ని,
అచంచలమైన విశ్వాసాన్ని
మనలో నింపి,
ముందుకు నడిపిస్తుంది.
కడుపు నింపి,కలవరపడి,
కన్నుల్లో వత్తులేసుకు చూసుకుంటుంది.
నిద్రలేని రాత్రులు గడిపి,
నిజం తానై నిలిచి,
జనని దైవమై కాపాడుతుంది.
సంతు ఉన్నతే తన లక్ష్యంగా జీవిస్తుంది.
కడవరకు ఆరాటపడి,
కంటి వెలుగై దారి చూపిస్తుంది.

కామెంట్‌లు