కౌశాంబిరాజు ఛత్రవర్మ ప్రజానురంజకంగా పాలిస్తున్నాడు. దయా దాతృత్వంతో పాటు వీరశౌర్య ప్రతాపం కలవాడు. తనచుట్టు పక్కల ఏడురాజ్యాల్ని జయించి తన రాజమహల్లో ఏడు ద్వారాలు పెట్టించాడు.ఏడవ ద్వారంగుండా రాజు ధనాగారంకి ద్వారం ఉంది. ఒకసారి పొరుగు రాజు పెళ్ళి కి వెళ్తూ తన గూఢచారి కి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశాడు. "చూడు ఎలాంటి మొహమాటం లేకుండా రాజమహల్లో జరిగే ప్రతి చిన్న విషయం పై నీవు కన్నేసి ఉంచు.అవన్నీ నాకు ఎంత బాధాకరమైనా ఫర్వాలేదు. నాకు చెప్పి తీరాలి. " ఆరోజు రాజు తిరిగిరాగానే"ప్రభూ!ధనాగారంనుంచి వెండి బంగారం అమూల్య వస్తువులు ఎప్పటినుంచో చోరీ అవుతున్న ట్లు నాకు అనిపించింది. "అన్నాడు గూఢచారి. రాజు నిండు సభలో అందరూ ఉండగానే "ఈరోజు నించి నేనే స్వయంగా ఖజానా కి కాపలికాస్తాను.దొంగలను పట్టుకుంటాను "అనగానే అంతా సిగ్గు తో తలవంచుకొన్నారు.రాజు కిగూడా దొంగల ఆచూకీ తెలీలేదు. ఒక వారం తర్వాత మళ్ళీ ప్రకటించాడు"దొంగని పట్టుకున్న వారికి వేయి బంగారు నాణాలు ఇస్తాను."కాశికాపురి నుంచి సుమంతుడనే పండితుడు వచ్చాడు. "ప్రభూ!నేను దొంగల జాడ కనిపెడతా"అన్నాడు. అంతా ముసిముసిగా నవ్వారు."పుస్తకాలు చదివే రాసుకునే ఈయన ఎలా దొంగలను పట్టుకోగలడు?" అని గుసగులాడుకున్నారు. రెండు రోజులు గడిచినా సుమంతునికి దొంగల ఆచూకీ తెలీలేదు. ఆరోజు పుచ్చఫువ్వులాంటి వెన్నెలలోరాజప్రాసాదానికి కాస్త దూరంలో ఉన్న చెట్టు పై నక్కి ఏడోద్వారంవైపు కన్నేసి ఉంచాడు.అటునుంచి ముగ్గురు వ్యక్తులు సొరంగం గుండా పెద్ద సంచుల్ని మోసుకుంటూ రావటం కనపడింది. రెండు రోజులు నిఘావేసి మూడోరోజు సభలో "మహారాజా!ఇంటిదొంగను ఈశ్వరుడు ఐనా పట్టలేడు.ఇక్కడ ఉన్న వ్యక్తి అతని ఇద్దరు కొడుకు లు చేస్తున్నారు దొంగతనం!" అనగానే "నిరూపించు"అన్నాడు రాజు. "ఇంకో రెండు రోజులు సమయం ఇవ్వండి" ఆతరువాత గూడా సుమంతుడు దొంగల్ని పట్టుకోలేకపోయాడు.మూడోరోజు సభలో "రాజా!మాట నిలుపుకోలేకపోయిన ఇతని శిరచ్ఛేదనం చేయండి " అన్నాడు మంత్రి. సభికులతోపాటు సుమంతుడు కూడా ఉలిక్కిపడ్డాడు.ఇంతలో సుమంతుడి స్నేహితుడు శంతనుడు మూడు పెద్ద సంచుల్ని భటులచేత మోయించుకుని వచ్చాడు. "ప్రభూ!ఇవి ఈరాత్రి దొరికినాయి.మీరు ఏడు ద్వారా లు కట్టించాక దానికి సొరంగం ని తవ్వించారు ఆదొంగలు!" వెంటనే మంత్రి గర్జించాడు "రాజు బాల్యస్నేహితుడిని.నాకు తెలీకుండా సొరంగం తవ్వే గుండె ధైర్యం ఎవరికుంది?"ఇంతలో ఇద్దరు యువకుల్ని భటులు బంధించి తెచ్చారు. వారి ని చూస్తూనే మంత్రి నిలువు గుడ్లేసుకుని నిలబడ్డాడు.ఆఇద్దరూ అతని కొడుకు లు. సుమంతుడు ఇలా చెప్పసాగాడు"ప్రభూ!సాధారణంగా మహామంత్రిని ఎవరూ అనుమానించరు.దాన్ని సాకుగా తీసుకుని స్వార్థం తో తన నేతృత్వంలోనే ఏడు ద్వారాలు నిర్మించటం జరిగింది. సొరంగాన్ని కూడా తవ్వించి ఆకూలీలను చంపేశాడు.అందరూ నిద్రపోయే సమయం లో రాత్రి పూట పహరావారిని పరీక్షించే నెపంతో మంత్రి వారి ని కబుర్లలో పెట్టి దూరంగా తీసుకుని పోతాడు. అప్పుడే అతని కొడుకు లు దొంగతనం చేసి సంచుల్ని మోసుకుపోతారు."మంత్రి అతని కొడుకు లు నేరాన్ని అంగీకరించటంతో వారిని చెరసాల లో పెట్టి సుమంతుని తన ఆంతరంగిక మంత్రి గా నియమించాడు రాజు 🌹
ఏడవతలుపు!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి