అతడే ; - సత్యవాణి
 రాముడైన కృష్ణు డైన
రాజ రత్నమైనా
అన్నయైన తమ్ముడైన
ఆత్మ బంధువైన
వెర్రి యైన తొర్రి యైన
వెంగళప్ప యైన
కుంటి యైన గ్రుడ్డియైన
నేతయైన నాతియైన యైననపుంసకుడెయైన
తండ్రి యైన తాతయైన
తల్లికి బిడ్డడునైన
రైతుయైన రాజుయైన
రాష్ట్ర భటుడు యైన
రాజరాజు కట్టబొమ్మన
వీరబ్రహ్మేంద్రుడైనా
ఆ కురువృద్ధుడు భీష్ముడైన
తెలుగు సాటి లేదన్న
కృష్టరాయలైనా
చాపకూటి బ్రహ్మన్న
చంద్రగుప్తుడైనా
నటరత్నం ఆతడే
ఆంధ్ర జాతి పరువుగుర్తు
అన్నగారు అతడే
తెలుగు వారి తీరు మార్చిన
దీటుగాడు అతడే
పట్టు పట్టి వదలనట్టి విక్రమార్కుడతడే
ఆంధ్రజాతి గుండెలలోని
అధినాయకుడతడే
అతనికి మనవందనం
శత సహస్త్ర వందన
మందారమాల అతడికే
          

కామెంట్‌లు